Monday, August 31, 2009

వినాయక నిమజ్జనం

నిన్న మా అపార్ట్మెంట్ లో వినాయకుడిని డి సి ఎం వ్యాన్లో తీసుకొని వెళ్లి ప్రగతి నగర్ చెరువు లో నిమజ్జనం చేసాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు శివరాత్రి కి గోవాడ తిరునాళ్ళకి వెళ్ళిన రోజులు, ట్రాక్టర్ ఎక్కి పల్లెటూర్లో పెళ్లికి వెళ్ళిన గుర్తులు అలా స్పృశించి వెళ్ళిపోయాయి. ఇప్పుడేమో డి సి ఎం వ్యాన్లో సిటీ నడిబొడ్డున కాసేపు అన్ని మర్చిపోయి నిమజ్జనం కెళ్తే చాలా బావుంది. అన్ని మర్చిపోవటం కాదు, మనసులో ఉన్న అన్ని సంశయాలు నెమ్మదిగా ఒక్కొక్కటి పక్కకి జరిపేసి నిమజ్జనం పుణ్యమా అని కాసేపు పాత అనుభవాన్ని కొత్తగా ఆస్వాదించాను. మా అపార్ట్మెంట్ లో గ్యాంగ్ ని నిజంగా అభినందించాలి. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా ఎంజాయ్ చెయ్యండి